హైదరాబాద్: 

బాణాసంచాను నిషేధించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

దీపావళికి క్రాకర్స్ పేల్చకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో న్యాయవాది ఇంద్ర ప్రకాశ్ పిల్ దాఖలు చేశారు.

కరోనా సమయంలో బాణాసంచా వల్ల ఇబ్బందులు తప్పవని పిటిషనర్‌ పేర్కొన్నారు.

వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. ఇప్పటి వరకు తెరిచిన బాణాసంచా షాపులను మూసివేయాలని ఆదేశించింది.

ఇప్పటికే రాజస్థాన్ హైకోర్టు బ్యాన్ చేసిందని, ఎవరూ బాణాసంచా అమ్మడం, కొనడం చేయొద్దని తన ఆదేశాల్లో పేర్కొంది.

ఎవరైనా అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేయాలని,  ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఈ నెల 19న తెలపాలని హైకోర్టు తెలిపింది.