హైదరాబాద్

– పచ్చ కామెర్లు వారికి లోకమంతా పచ్చగా కనిపించినట్టే.. బూతు పురాణం రాధాకృష్ణకు అన్నీ బూతులుగానే కనిపిస్తాయి.
– బూతు వార్తలు ప్రచారం చేసే రాధాకృష్ణను “బూతు కిట్టు” అని ఎందుకు అంటున్నారో అర్థమైంది..!
– ఓటుకు కోట్లు కేసులో బ్రీఫ్డ్ మీ.. అంటూ ఆడియో, వీడియోల్లో చంద్రబాబు దొరికిపోతే ఎల్లో మీడియాలో ఎందుకు చూపించలేదు?
– టీఆర్పీ రేటింగ్‌ల కోసం దళిత ఎమ్మెల్యేపై ఎల్లో మీడియా విషప్రచారం చేస్తుంది
– ఎల్లో మీడియాలో తనపై అసత్య కథనాలు ప్రసారం చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉండవల్లి శ్రీదేవి
– తప్పుడు వార్తలు ప్రసారం చేసేటప్పుడు కనీసం వివరణ కూడా అడగలేదు
– తనపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఫేక్ ఆడియో, వీడియోలపై పోలీసులకు ఫిర్యాదు
– రాధాకృష్ణ సామాజిక వర్గానికో న్యాయం.. దళితులకో న్యాయమా?
– ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతిలో సగం వాటా చంద్రబాబుదే
– రాజకీయంగా మునిగిపోయే టీడీపీని, చంద్రబాబును బ్రతికించుకోవాలన్న రాధాకృష్ణది వృథా ప్రయాసే
– సీఎం శ్రీ జగన్ మహిళా పక్షపాతి, దళితుల పక్షపాతి.. ఆయన పెట్టిన రాజకీయ భిక్షవల్లే ఎమ్మెల్యే అయ్యాను.
– ఎల్లో మీడియాలో వచ్చే తప్పుడు వార్తలకు భయపడేది లేదు, పోరాడతాను

– వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ…

1. టీడీపీ అనుకూల ఎల్లో మీడియాలో, టీడీపీ సోషల్ మీడియాలో తనపైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఫైర్ అయ్యారు. కొంత మంది ఫ్యాబ్రికేటెడ్ ఆడియో, వీడియోలు ఇస్తే మీడియాలో ఆ కథనాలు ప్రసారం చేస్తూ వాటిని పత్రికల్లో ప్రచురిస్తున్నారు, తప్ప అందులో అసలు నిజం ఉందో, లేదో కూడా తెలుసుకునే కనీస ప్రయత్నం ఎల్లో మీడియా చేయలేదు. ఒక డాక్టర్ గా, దళిత ఎమ్మెల్యేగా ఉన్న తనపైన ప్రత్యేకించి ఏబీఎన్, టీవీ5 ఎల్లో మీడియాల్లో ఇష్టారాజ్యంగా తప్పుడు వార్తలు వండి వారుస్తూ ప్రచారం చేస్తున్నారు.

2. మీడియా అంటే ఫోర్త్ ఎస్టేట్, ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంలా నిష్పక్షపాతంగా ఉండాల్సిన మీడియా ముసుగులో.. ఓ వర్గం మీడియా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తుందో చూస్తున్నాం. దళిత డాక్టర్‌ను అయిన నాకు సీఎం శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టారు. టీడీపీ అనుకూల మీడియాలో తనపై కథనాలు ప్రసారం చేసేటప్పుడు కనీసం వాటిపై తన వివరణ కూడా తీసుకోలేదని ఉండవల్లి శ్రీదేవి అన్నారు.

3. ఆడియో లీకులపై పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటం జరిగిందని, ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో నిజానిజాలు వెలుగులోకి వచ్చే వరకు ఆగకుండా ఈ విధంగా మీడియా వ్యవహరించటం ఏంటని ఉండవల్లి శ్రీదేవి ప్రశ్నించారు. నాపై రోజుకో ఫ్యాబ్రికేటెడ్ వీడియో, ఆడియో విడుదల చేస్తున్నారని, అయితే రూ. ఐదు కోట్లతో ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు బ్రీఫ్డ్‌ మీ.. అని మాట్లాడుతూ పట్టుబడితే ఏబీఎన్‌ ఛానల్ అధినేత రాధాకృష్ణ ఎన్నిసార్లు ఆ వార్తను ప్రసారం చేశారో గుండెమీద చేయి వేసుకొని చెప్పాలని శ్రీదేవి ప్రశ్నించారు. ఏబీఎన్‌ ఛానల్‌లో సగం వాటా చంద్రబాబుదే అని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. ఓటుకు కోట్లు కేసులో ఒక్కసారి కూడా చంద్రబాబు గురించి ఏబీఎన్‌లో ప్రసారం చేయలేదు. కానీ దళిత డాక్టర్‌ రాజకీయాల్లో వస్తే.. మహిళ అని కూడా చూడకుండా అసత్య ప్రసారాలు చేసి తొక్కేస్తారా?, అసత్య ప్రసారాలు చేసి ఏం సాధించాలని అనుకుంటున్నారని శ్రీదేవి ప్రశ్నించారు. కనీసం ఒక్కసారి తనను కానీ తన భర్తను ఏనాడూ వివరణ కూడా అడగలేదని, సంప్రదించలేదన్నారు.

4. అందరూ రాధాకృష్ణను “బూతు కిట్టు” అంటున్నారని ఇదేంటి బూతు కిట్టు అనటం ఏం చేశారో నాకు అర్థం కాలేదని కానీ ఇప్పుడు నాకు బాగా అర్థం అవుతోందన్నారు. మీరు చేసే బూతు ప్రచారాలు ఆధారంగా తీసుకొని దళితుల్ని అణగదొక్కుతున్నారు. చంద్రబాబేమో దళితులుగా ఎవరు పుట్టాలని అనుకుంటారు అని మాట్లాడతాడు. చంద్రబాబు హయాంలో కొంతమంది మంత్రులు ఏమో.. దళితులు శుచీ,శుభ్రంగా ఉండరు చదువు రాదంటారు. దళితులపై బూతు ప్రచారాలు చేస్తున్నారు కాబట్టే బూతు కిట్టు అని రాధాకృష్ణకు ప్రజలు బిరుదు ఇచ్చారు.

5. ఇదే ఫ్యాబ్రికేటెడ్ ఆడియోలు, వీడియోలో, మార్ఫింగ్ చేసి మీ తల్లినో, చెల్లినో, అక్కనో.. నీ మొహమే.. తీసుకువెళ్లి బ్లూఫిల్మ్‌లో పెట్టి వెబ్‌సైట్‌లో పెడితే నువ్వు ఎంత బాధపడతావ్‌. మీది పెద్ద సామాజికవర్గం కాబట్టి, మేం దళితులం కనుక ఏమైనా అనొచ్చు, వివరణ ఎందుకు తీసుకోవాలి, టీవీ ఛానెల్ కు టీఆర్‌పీ రేటింగ్ లు వస్తే చాలు, అదే కదా మీ ఉద్దేశమంటూ ఉండవల్లి శ్రీదేవి మండిపడ్డారు. శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు ఎక్కడ.. మీరు ఎక్కడ..? నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తుందని శ్రీదేవి అన్నారు.

6. ఇలాంటి ప్రచారాలు చేసేటప్పుడు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారిని అయినా కనీసం వివరణ కోరారా..? ఎంత వరకు విచారణ జరిగిందని అధికారిని అడగరు, కనీసం తన వివరణ కూడా తీసుకోరని శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని ఉండవల్లి శ్రీదేవి హితవు పలికారు.

7. ఇటీవల తిరుపతిలో ఓ మహిళ రాధాకృష్ణను చెప్పుతో కొడతానని అన్నది. ఇప్పటికైనా రాధాకృష్ణ.. బూతు కృష్ణ చేసే ప్రచారాలలో వాస్తవాలు తెలుసుకుని ప్రసారం చేయమని ఉండవల్లి శ్రీదేవి సూచించారు. అంతేగానీ టీఆర్పీ రేటింగ్ ల కోసం ఇలా చేయటం మంచిది కాదు. రాధాకృష్ణకు, ఆయన సామాజిక వర్గానికి చెందిన అందరిదీ ఒకటే రూట్… దళిత మహిళలు ఏమైనా ఫర్వాలేదని వ్యవహరించటం సరికాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

8. దళిత మహిళను అయిన తాను స్వయంకృషితో డాక్టర్‌ను అయితే, శ్రీ వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి గారు రాజకీయ భిక్ష పెడితే ఎమ్మెల్యేను అయ్యానని శ్రీదేవి అన్నారు. సీఎం శ్రీ జగన్ పాదయాత్రలో ఏ ప్రజలు ఆయన పక్కన ఉన్నారో చూస్తే తెల్సేదన్నారు. పచ్చ కామెర్లు ఉన్నవాడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందన్నట్లు బూతు పురాణం ఉన్నవాడికి జనాలు అంతా బూతు మాటలు మాట్లాడుతున్నట్లు కనిపిస్తున్నారు.

9. మునిగిపోయే పార్టీ టీడీపీని, చంద్రబాబును బ్రతికించుకోవాలని రాధాకృష్ణ, ఇతర ఎల్లో మీడియా ఆరాటపడుతుంది. 2019 ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో సైకిల్‌ను విసిరి మూలన పడేశారు. కాంగ్రెస్‌ ఎలా కనుమరుగు అయిందో… రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో, 2024 ఎన్నికల నాటికి తెలుగుదేశం కనుమరుగు కావటం ఖాయం అని శ్రీదేవి అన్నారు. మునిగిపోతున్న పార్టీని బ్రతికించాలని రాధాకృష్ణ ప్రయత్నం వ్యర్థం. వృథా ప్రయాసే.

10. నిజాలు నిలకడమీద తెలుస్తాయి. చెడు మీద ఎప్పటికైనా మంచి అనేది విజయం సాధిస్తుంది. శ్రీ జగన్ గారు మహిళా పక్షపాతి, దళిత పక్షపాతి. ఎల్లో ఛానల్స్‌, ఎల్లో మీడియాలో వచ్చే ప్రసారాలకు భయపడే పరిస్థితి లేదు. ఎల్లో మీడియా ఈ జన్మకు మారదు. సభ్యసమాజం తలదించుకునే మాదిరిగా పనిచేయవద్దని అసత్యప్రచారాలు ఆపి నిజాలు తెలుసుకోవాలి. లేకపోతే వీరికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెబుతామని ఉండవల్లి శ్రీదేవి హెచ్చరించారు.
[4:55 PM, 11/12/2020] +91 94404 55999: (టీవీ5 స్క్రోలింగ్) గుంటూరు : జిల్లా జైలు నుంచి విడుదలైన కృష్ణాయపాలెం దళిత, బీసీ రైతులు – గత నెల 24న రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు – 20 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైన రైతులు – రైతులకు ఘనంగా స్వాగతం పలికిన జేఏసీ నాయకులు – రాజధాని ప్రాంతంలో నిరసన తెలపడానికి వస్తున్నవారిని అడ్డుకున్నారని రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు – దళిత సామాజిక వర్గానికి చెందిన రైతులు : ఇపూరి సందీప్, కిషోర్, రవికాంత్, నంబూరి రామారావు, కుక్కమళ్ల అమర్ బాబు విడుదల – బీసీ వర్గానికి చెందిన రైతులు : దానబోయిన బాజి, సొంటి నరేష్ విడుదల – ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు – పోలీసుల తీరును తప్పుపట్టిన హైకోర్టు – జైలు వద్దకు భారీగా చేరుకున్న టీడీపీ, సీపీఐ నేతలు, రాజధాని జేఏసీ నేతలు, రైతులు – సబ్ జైలు వద్ద నుంచి లాడ్జి సెంటర్ అంబేడ్కర్ బొమ్మ వరకు భారీ ర్యాలీ