ఆకాశవాణి న్యూఢిల్లీ కేంద్రంగా వార్తలు చదివిన ఏడిద గోపాలరావు గారు భౌతికంగా దూరం అయ్యారు. మాస్కోలో (రష్యా) కూడా ఆయన కొంతకాలం వుండి వార్తలు చదివారు. న్యూఢిల్లీలో సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో నిర్వహించారు. సరస నవరస సంస్థను స్థాపించి ఢిల్లీలో, హైదరాబాద్ లో జాతీయ నాటకోత్సవాలు నిర్వహించారు.
ఢిల్లీ వచ్చిన తెలుగు వారికి మంచి ఆతిథ్యాన్ని ఇచ్చేవారు. నేతాజీ నాటకం లో గాంధీజీ వేషానికి పరిచయం చేయగా,గాంధీ ప్రధాన పాత్రగా బాపూ చెప్పిన మాట నాటికను డా విజయ భాస్కర్ తో వ్రాయించి దాదాపు 50 ప్రదర్శనలిచ్చారు. యువకళావాహినితో ఎంతో అనుబంధం వుంది. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని కోరుకుంటున్నాం.