సమాజంలో హింసా, విధ్వంసాలకు చరమగీతం పాడిన రోజు..బలహీనులపై దాడులు, దౌర్జన్యాలు అంతమైన శుభదినం.. రాక్షసత్వంపై మానవత్వం విజయం సాధించిన పర్వదినం..అరాచకాల చీకట్లనుంచి ఆనందపు వెలుగుల వైపు నడిపించే వెలుగు దివ్వెల పండుగ దీపావళి.
దేశ,విదేశాల్లో ఉన్న తెలుగువారు అందరికీ నరక చతుర్దశి, దీపావళి పండుగ శుభాకాంక్షలు. కరోనా నిబంధనలను పాటిస్తూ మీరంతా కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని, ఈ దీపావళి మీకు సకల శుభములు చేకూర్చాలని ఆకాంక్షిస్తున్నాను.
(నారా చంద్రబాబు నాయుడు)