దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 8,55,692 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 7,350 కొత్త కేసులు నమోదు కాగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.46 కోట్లకు చేరింది. నిన్న ఒక్కరోజే 202 మంది మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 4,75,636గా ఉంది. గత 24 గంటల్లో 7,973 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 91,456కి చేరాయి.