సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో సోమవారం సందర్భంగా స్వామివారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు పోటెత్తారు.

తెల్లవారుజాము నుంచి స్నానాలు ఆచరించిన భక్తులు దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరి స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాల్లో రద్దీ నెలకొని దర్శనానికి సుమారు ఐదున్నర గంటల సమయం పట్టింది. ఇవాళ 60వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు చెప్పారు.