గత కొంతకాలంగా అన్ని ధరలతోపాటు వంటకు ఉపయోగించే నూనెల ధరలు కూడా పెరిగిన సంగతి తెలిసిందే.. 90 రూపాయలు ఉండేటువంటి వంటనూనెల ధరలు డబుల్ అయి 180 రూపాయలకు చేరాయి. దీంతో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలో వంటనూనెల ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత నెల రోజుల్లో కేజీ నూనె ధర రూ.8 నుంచి… రూ.10 మేర తగ్గింది.

ఈ నేపథ్యంలో మరో నాలుగు రూపాయలు తగ్గే అవకాశం ఉందని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. మన దేశంలో ఈ ఏడాది 120 లక్షల టన్నుల సోయాబీన్ ఉత్పత్తి, రెండు లక్షల టన్నుల మేర అదనంగా వేసిన వేరుశనగ పంటల కారణంగా త్వరలోనే వంటనూనెల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. త్వరలోనే 150కి దిగువగా వంటనూనెల ధరలు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆయిల్ కంపెనీ కూడా చెబుతుంది.