లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC)కి ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లో వాటాను 9.99 శాతం వరకు పెంచుకోవడానికిగాను ఆర్బీఐ అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం ఇండస్ఇండ్ బ్యాంకులో ఎల్‌ఐసీ 4.95 శాతం కలిగి ఉండగా దానిని 9.99 శాతం వరకు పెంచుకునేందుకు ఆర్‌బీఐ అనుమతి కోరింది.

ప్రైవేటు సెక్టార్ బ్యాంక్‌ల్లో యాజమాన్యం, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలకు అనుగుణంగా ఆమోదముంటుంది. ఈ ఆమోదం ఏడాది వరకు అంటే వచ్చే ఏడాది డిసెంబరు 8 వరకు చెల్లుబాటవుతుంది. అయితే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనలను అనుసరించి ప్రైవేటు బ్యాంకుల్లో 5 శాతానికి మించి వాటా పెంచుకోవాలంటే ఆర్బీఐ ఆమోదం కావాలి.