ఉదయం సానుకూలంగా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొని మార్కెట్ ముగిసే సమయానికి నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం సెన్సెక్స్‌ 59,103.72 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమై ఇంట్రాడేలో 59,203.37 వద్ద గరిష్ఠాన్ని తాకి చివరకు 503.25 పాయింట్ల నష్టంతో 58,283.42 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 17,619.10 పాయింట్ల వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 17,639.50-17,355.95 మధ్య కదలాడి చివరకు 143.05 పాయింట్లు నష్టపోయి 17,368.25 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్‌ 30 మారుతీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫినాన్స్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, సన్‌ఫార్మా, ఏషియన్‌ పెయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు లాభాల్లో ముగిసాయి. పవర్‌గ్రిడ్‌, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌ మాత్రం నష్టాల్లో మునిగాయి.