యాదాద్రి జిల్లాలోని వంగపల్లి కెమికల్ ఫ్యాక్టరీలో ఆదివారం సాయంత్రం భారీ పేలుడు సంభవించి రియాక్టర్ పేలుడు ధాటికి కెమికల్స్ ఎగసిపడ్డాయి. దీంతో ఫ్యాక్టరీ మొత్తం దట్టంగా పొగ కమ్ముకుంది. సైరన్ మోగడంతో కార్మికులు భయంతో పరుగులు తీయగా ఏం జరిగిందో తెలియక ప్రజలు భయంతో వణికిపోయారు. కెమికల్స్ రోడ్డుపైన పడటంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పేలుడు గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.