దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్‌ 338 పాయింట్ల లాభంతో 59,125 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 105 పాయింట్ల లాభంతో 17,617 వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, ఏషియన్‌ పెయింట్స్‌, టాటా స్టీల్‌, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, టైటన్‌ షేర్లు లాభాలబాట పడ్డాయి. నెస్లే ఇండియా, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫినాన్స్‌ మినహా అన్ని షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.