రూ.2 లతో 65 కిలోమీటర్లు ప్రయాణించే ఉటన్ ఎనర్జియా బైక్..!!

0
1

పలు స్టార్టప్ కంపెనీలు తక్కువ ఖర్చుతో ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించడమే లక్ష్యంగా వాహనాలను రూపొందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అతి తక్కువ ఖర్చుతో చాలా ఎలక్ట్రికల్ బైక్ లు ఇప్పటికే మార్కెట్ లో వచ్చినప్పటికీ ఇంకా చాలా సౌకర్యవంతంగా ఎక్కువ కీలోమీటర్లు ప్రయాణించడానికి వీలుగా బైక్ ను.. స్టార్ట్ఫ్ ఉటన్ ఎనర్జియా అనే సంస్థ రూపొందించింది.

ఒక గంటపాటు చార్జ్ చేస్తే దాదాపు 65 కిలోమీటర్ల వరకు ఈ బైక్ పై ప్రయాణించడానికి వీలవుతుంది. పొర్టీఫైవ్ అనే పేరుతో మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ బైక్ కి ఇప్పుడు ఆన్ లైన్ లో బుకింగ్స్ కూడా మొదలైయ్యాయి. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ బైక్ ఒక్కసారి చార్జీ చేస్తే దాదాపు 65 నుంచి 70 కిలో మీటర్ల వరకు ప్రయాణించగలదు. దీంతో పాటు చార్జీ చేయాడానికి కేవలం ఒక్కటి లేదా రెండు యూనిట్ పవర్ మాత్రమే ఖర్చు అవుతుందని చెబుతున్నారు కంపెనీ ప్రతినిధిలు. అంటే కేవలం 5 రూపాయిల లోపే అన్న మాట.

ఐదు రూపాయిలతో దాదాపు 65 కిలోమీటర్ల వరకు ప్రయాణించడానికి వీలవుతుంది. మార్కెట్ లో అందుబాటులో ఉన్న ఏ బైక్ కూడా ఇంత తక్కువ ధరలో లేదని ఉటన్ ఎనర్జిజా సంస్థ లోని ఈ బైక్ ను తయారు చేసిన హర్షవర్దన్ తెలిపారు. 20×4 సైజ్ లో ఉండే ఈ బైక్ టైర్లు మనం రోజు వాడే బైక్ టైర్ల కంటే భిన్నంగా ఉండడంతో ఈ బైక్ ఎలాంటి ప్రతికూల మార్గాల్లో అయిన ఈజీ ప్రయాణించడానికి కుదురుతుందని అంటున్నారు. పూర్తీ స్థాయి బ్యాటరీ బేకప్ తో వచ్చే ఈ బైక్ ప్రస్తుతం 35 వేల రూపాయిలకు మార్కెట్ లో అందుబాటులో ఉంది. కంపెనీకి చెందిన వెబ్ సైట్ లో 9,999 రూపాయలు ఇచ్చి బుక్ చేసుకునే సౌలభ్యం ఉంది.

ప్రస్తుతానికి రెండు కలర్స్ మాత్రమే అందుబాటులో ఉన్నప్పట్టికీ త్వరలోనే వీలైనన్ని రంగులు అందుబాటులోకి తెస్తామని అంటున్నారు. ఈ బైక్ లో 675 వాల్ట్ బ్యాటరీని పొందుపర్చారు. ఈ బైక్ చార్జ్ చేయడానికి ప్రత్యేకమైక ఫ్లగ్ ఉపయోగించనవసరం లేకుండానే నిత్యం ఫోన్ చార్జింగ్ చేసుకునే సాకెట్ నుంచే చార్జ్ చేసుకునే సౌలభ్యం కలిగి ఉంది.