దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 17 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తే 2.6 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 315 మరణాలు సంభవించడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 4.85 లక్షలకు చేరింది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు 12 లక్షలకు చేరాయి. నిన్న లక్ష మందికిపైగా కొవిడ్ నుంచి కోలుకున్నారు.

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులు 5,753కి పెరిగాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, దిల్లీ, కేరళలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.