ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రకాల ప్రొడక్ట్‌లపై డిస్కౌంట్‌లు ఆఫర్ చేస్తుంది. ఈ సేల్ పేరు బిగ్ బిలియన్ డేస్ 2022. ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్ కోసం వెబ్‌సైట్‌లో ఒక ప్రత్యేక పేజీని కూడా ఓపెన్ చేసింది. ఈ స్పెషల్ సేల్ జనవరి 17 నుంచి 22 వరకు జరుగుతుంది. అయితే మరొక ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అయిన అమెజాన్‌ కూడా ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ పేరిట ఓ సేల్‌ను ప్రకటించింది. ఇది కూడా జనవరి 17 నుంచి జనవరి 20వ తేదీ వరకు లైవ్ లో ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2022 సేల్‌లో భాగంగా మొబైల్స్, ఫర్నిచర్, డిజిటల్ డివైజులు, బట్టలు వంటి వస్తువులపై అదిరిపోయే డిస్కౌంట్లను అందుబాటులోకి తెస్తోంది. కొనుగోలుదారులు సేల్ నడుస్తున్న సమయంలో అతి తక్కువ ధరలకే వివిధ రకాల వస్తువులను సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు జనవరి 16వ నుంచే అందుబాటులోకి వస్తుంది. కొనుగోలుదారులందరూ కూడా ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్లు పొందొచ్చు. అయితే కొనుగోలు దారులు తమ ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్ కార్డులు ఉపయోగించి అదనంగా 10 శాతం రాయితీ దక్కించుకోవచ్చు. సేల్ ప్రారంభానికి మరి కొద్ది రోజులు సమయం ఉంది కాబట్టి ఇప్పటివరకైతే ఏయే కంపెనీల నుండి స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ లపై డిస్కౌంట్ దొరుకుతుందనేది ఫ్లిప్‌కార్ట్ వెల్లడించలేదు. కాకపోతే కేటగిరీల వారీగా ఎంత మేర డిస్కౌంట్ ఆఫర్ చేస్తామనేది మాత్రమే ప్రకటించింది.

ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులపై 80 శాతం వరకు తగ్గింపులు ప్రకటించడంతో కొనుగోలుదారులు ఈ సేల్ కు ఆకర్షితులవుతున్నారు. అలాగే హెడ్ ఫోన్లు, స్పీకర్లు వంటి ఆడియో పరికరాలపై ఏకంగా 70 శాతం డిస్కౌంట్ ఇస్తామని తెలిపింది. ఇక స్మార్ట్ వేరియబుల్స్ పై 60 శాతం, ల్యాప్ టాప్, డెస్క్ టాప్స్ పై 40 శాతం, స్మార్ట్ ఫోన్ యాక్ససరీలపై 70 శాతం వరకు డిస్కౌంట్లు ప్రకటించింది. తక్కువ ధరలకే ఇలాంటి వస్తువులను సొంతం చేసుకోవాలనుకునే వారు బిగ్ బిలియన్ డేస్ఉపయోగించుకోండి. స్మార్ట్ వాచీలపై 60 శాతం, టీవీ & హోం అప్లయన్సెస్ పై 75 శాతం వరకు రాయితీలు అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. బట్టలు కొనుగోలు చేయాలనుకునే వారు కూడా తీపి కబురు అందించింది. బట్టలపై ఏకంగా 60 నుంచి 80 శాతం డిస్కౌంట్ ఇస్తామని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.