దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు నేడు ఫ్లాట్ గా ముగిసాయి. భారీ నష్టాల మధ్య ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత అనూహ్యంగా పుంజుకున్నాయి. ఉదయం సెన్సెక్స్‌ 61,040.32 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమై, దాదాపు మధ్యాహ్నం వరకు అదే ధోరణిలో సాగి, ఓ దశలో స్వల్ప లాభాలూ నమోదు చేసి, చివరకు 12.27 పాయింట్లు నష్టపోయి 61,223.03 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచీ 61,324.59 – 60,757.03 మధ్య కదలాడింది. నిఫ్టీ సైతం 18,185.00 వద్ద నష్టాలతో ప్రారంభమైంది. రోజు మొత్తంలో 18,286.95 – 18,119.65 మధ్య కదలాడి, చివరకు 2.10 పాయింట్ల స్వల్ప నష్టంతో 18,255.70 వద్ద ముగిసింది.

నిఫ్టీ50 సూచీలో లాభపడిన / నష్టపోయిన షేర్లు ఏంటంటే.. ఐఓసి, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, టాటా కన్స్యూమర్ , టిసిఎస్ షేర్లు లాభాల్లో ముగిసాయి. హెచ్ యూ ఎల్, యూ పి ఎల్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంకు, ఓ ఎన్ జి సి షేర్లు నష్టాల్లో ముగిసాయి.