కాన్పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ).. ఒప్పంద ప్రాతిపదికన 04 ఆర్‌ఈవో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిలో సీనియర్‌ ప్రిన్సిపల్‌ ఆర్‌ఈవో, ప్రిన్సిపల్‌ ఆర్‌ఈవో, సీనియర్‌ ఆర్‌ఈవో, ఆర్‌ఈవో(గ్రేడ్‌1) పోస్టులు భర్తీ కానున్నాయి. అర్హత విషయానికి వస్తే పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్‌/బీఈ/బీఎస్, పీహెచ్‌డీ /ఎంటెక్‌/ఎమ్మెస్సీ/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. వయసు 14.01.2022 నాటికి 45 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు జీతం నెలకు రూ.67,700 నుంచి రూ.2,16,600 వరకు చెల్లిస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదిగా 14.01.2022 నిర్ణయించారు. వెబ్‌సైట్‌: https://www.iitk.ac.in/