జేఎన్టీయూ కాకినాడ లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్, యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్, విజయనగరంలోని యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ల్లో స్పాన్సర్డ్‌ కేటగిరీలో ఎంటెక్, ఎంబీఏ
సీట్ల భర్తీ కోసం ఈ నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నామని వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొ.ఎల్‌.సుమలత సోమవారం తెలిపారు.

ఈ సీట్ల కోసం జనవరి 20, 21, 22 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థులు గేట్‌/జీప్యాట్‌/ఏపీపీజీఈసెట్‌/ఐసెట్‌లలో అర్హత సాధించి ఉండాలని, దాంతో పాటు ఏడాదిపాటు ఉద్యోగ అనుభవం తప్పనిసరి అని చెప్పారు. ఈ నెల 20న జేఎనీ్టయూకే సెనేట్‌ హాల్‌లో ఎంబీఏ, ఎంబీఏ (సీఎంయూ) కోర్సులకు, 21, 22 తేదీల్లో ఎంటెక్‌ కోర్సులకు కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు.

అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్మీడియేట్, డిగ్రీ మార్కుల జాబితాలు, టీసీ, కాండక్ట్‌ సర్టిఫికెట్, స్పాన్సర్షిప్‌ సర్టిఫికెట్, గేట్‌/జీప్యాట్‌/ ఏపీపీజీఈసెట్‌/ఐసెట్‌ 2021 హాల్‌టికెట్, ర్యాంక్‌ కార్డు, రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు తీసుకురావాలని సూచించారు. పూర్తి వివరాలను https:// www. jntuk. edu. in/ద్వారా తెలుసుకోవాలని సూచించారు.