చెన్నై ఎయిర్‌పోర్డ్‌లో దుబాయ్ ప్రయాణీకుల వద్ద రూ.55.29 లక్షల విలువ చేసే యూఎస్ డాలర్స్, దిర్హమ్స్, దినార్స్, రియాల్స్‌ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ వెళుతున్న ముగ్గురు ప్రయాణీకులు కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా, విదేశీ కరెన్సీని ట్రాలీ బ్యాగ్‌కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జిప్‌లో దాచి తరలించేందుకు ప్రయత్నించారు.
కస్టమ్స్ అధికారులు నిర్వహించిన స్కానింగ్ లో విదేశీ కరెన్సీ బయటపడింది. దీంతో కరెన్సీ సీజ్ చేసి ఆ ప్రయాణీకులను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఫేమా చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.