ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) -2022 టైటిల్ స్పాన్సర్‌ షిప్‌ చేసేది ఎవరనే విషయం పై గత కొన్ని రోజుల నుంచి అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. గత కొన్ని సీజన్ల నుంచి వీవో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్‌ స్పాన్సర్‌ గా వ్యవహరిస్తోంది. కానీ తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) -2022 టైటిల్ స్పాన్సర్‌ షిప్‌ గా టాటా కంపెనీ నియామకం అయినట్లు ఐపీఎల్‌ చెర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ పేర్కొన్నారు.

ఇండియాకు చెందిన కంపెనీ కావడంతో.. ఈ సారి టాటా కంపెనీనే నియామకం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఐపీఎల్‌ ప్రసారహక్కుల విక్రయం ద్వారా దాదాపు రూ. 35 వే కోట్లు, ఐపీఎల్‌ 2022 సీజన్‌ లో రెండు కొత్త జట్ల ద్వారా రూ. 12 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని దక్కించుకున్న బీసీసీఐ.. ఐపీఎల్‌ టైటిల్ స్పాన్సర్‌ షిప్‌ ద్వారా టాటా నుంచి రూ.300 నుంచి రూ.350 కోట్ల ద్వారా పొందనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.