హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రి మెడికల్ సూపరిటెండెంట్ అధికార ప్రకటన విడుదల చేస్తూ గాంధీ ఆస్పత్రిలో రోజువారి చికిత్స కోసం వచ్చే వారికి అనుమతి నిరాకరిస్తూ గాంధీలో కరోనా చికిత్స కోసం వచ్చే వారికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. అత్యవసర చికిత్సకు వచ్చే రోగులకు సడలింపు ఇస్తున్నట్లు, ఇది వరకే అడ్మిట్ అయి చికిత్స తీసుకోని ఉంటున్న రోగులను త్వరలోనే డిశ్చార్జ్ చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా గాంధీలో పనిచేస్తున్న సిబ్బందికి, వైద్యులకు సెలవులు కూడా రద్దు చేశారు.