హిందూ సంప్రదాయాల ప్రకారంగా మకర సంక్రాంతి పండుగ ఎంతో విశిష్టమైనది. ఈ పండుగకు ప్రతీ ఒక్కరు దాదాపుగా తమ సొంతూళ్లకు వెళ్లి హాయిగా గడిపేస్తుంటారు. అలా ఈ మకర సంక్రాంతి జనాలకు అత్యంత ఇష్టమైన పండుగ. అయితే ఈ పండుగ రోజున శాస్త్రం ప్రకారం ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. మకర సంక్రాంతి పండుగ రోజున సూర్య భగవానుడు, శని దేవుడిని పూజించాలి. ఈ రోజున దానధర్మాలు చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులతో కూడిన వాతావరణం నెలకొంటుందని ప్రజలు నమ్ముతారు.

సూర్యుడికి ఈ రోజున పూజలు చేస్తే కనుక చక్కటి ప్రయోజనాలు కలుగుతాయని పండితులు వివరిస్తున్నారు. ఈ పండుగ రోజున నువ్వులతో చేసిన వస్తువులను కంపల్సరీగా దానం చేయాలి. అలా చేయడం వలన చాలా ఉపయోగాలుంటాయట. 14 రకాల వస్తువులను దానం చేయాలి. ఈ రోజున దానం చేస్తే కనుక మిగతా రోజుల్లో చేసిన దానాల కంటే కూడా ఎక్కువ రెట్ల ప్రయోజనం కలుగుతుంది.

ఈ రోజున దాన, ధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్న క్రమంలో ఈ రోజున ఎవరైనా ఇంటికి వస్తే కనుక ఖాళీ చేతులతో అస్సలు బయటకు పంపొద్దు. వారికీ అతిథి సత్కారం చేసి కడుపు నింపి పంపించాలి. ఇకపోతే ఈ రోజున అందరూ పవిత్రంగా పూజలు చేస్తుంటారు. కావున ఈ రోజున ఎవరూ మద్యం తీసుకోకూడదు. ఉపవాసం ఉండే వారు అయితే కంపల్సరీగా నిష్టగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్నానం, పూజకు ముందర ఆహారం తీసుకోకూడదు.