రాజకీయం (Politics)

ఏపీలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు న‌గారా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పంచాయ‌తీ ఎన్నిక‌లు త్వ‌ర‌లో ముగియ‌నున్న నేప‌థ్యంలో మ‌రో ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధం చేస్తోంది రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌. అతి త్వ‌ర‌లోనే మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు సంబంధించి నోటిఫికేష‌ర్ విడుద‌ల చేయాల‌ని భావిస్తోంది. మార్చి చివ‌ర‌కు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. త‌న హ‌యాంలోనే అన్ని ఎన్నిక‌లు పూర్తి చేయాల‌ని ఆయ‌న భావిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో మున్సిప‌ల్ ఎన్నిక‌లు మొద‌ట నిర్వ‌హించేందుకు ఆయ‌న మొగ్గు చూపుతున్న‌ట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 12 మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లలోని 671 డివిజ‌న్ల‌‌కు, 75 మున్సిపాలిటీ, న‌గ‌ర పంచాయ‌తీల్లోని 2,123 వార్డుల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. నిజానికి ఈ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లు, మున్సిపాలిటీల పాల‌క‌మండ‌ళ్ల గ‌డ‌వు ఎప్పుడో ముగిసింది. కానీ, ఎన్నిక‌లు జ‌ర‌గ‌లేదు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభ‌మై, నామినేష‌న్లు కూడా వేసిన త‌ర్వాత క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డ్డాయి.

అప్పుడు వాయిదా వేసిన ఎన్నిక‌ల‌ను ఇప్పుడు పూర్తి చేయాల‌ని నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ భావిస్తున్నారు. షెల్యూల్ ప్ర‌క‌టించిన త‌ర్వాత మొత్తం నెల రోజుల్లోనే ఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్తి చేయాల‌ని, అయితే ఎక్క‌డ ఎన్నిక‌ల ప్ర‌క్రియ ఆగిపోయిందో అక్క‌డి నుంచే ప్రారంభిస్తారా లేదా మ‌ళ్లీ మొద‌టి నుంచి నిర్వ‌హిస్తారా అనేది తెలియాల్సి ఉంది. మ‌రోవైపు పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో మంచి ఫ‌లితాలు సాధిస్తున్న వైసీపీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు కూడా సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.