ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle)

టీకా తీసుకున్న నిమ్స్ డాక్టర్లకు కోవిడ్! టీకా తీసుకున్నా 42 రోజుల అన్ని జాగ్రత్తలతో ఉండాల్సిందే!!!

దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఇండియాలో కవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను అందిస్తున్నారు. ఈ రెండు టీకాలూ సురక్షితమైనవేనని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేస్తుండగా, వైద్యుల్లోనే టీకా పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  తాజాగా హైదరాబాద్ నిమ్స్ లో కలకలం రేగింది. కరోనావ్యాక్యిన్ ను తీసుకున్న 20 రోజుల తరువాత.. ఇద్దరు ప్రముఖ వైద్యులకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది.  నిమ్స్ కు చెందిన ఓ రెసిడెంట్ డాక్టర్ కు, ఉస్మానియాకు చెందిన పీజీ విద్యార్థికీ కరోనా సోకింది. వీరిద్దరూ దాదాపు 20 రోజుల క్రితం కరోనా టీకా తొలి డోస్  తీసుకున్నారు. 

ఇద్దరు వైద్యులకు కరోనా సోకిన విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. టీకా తీసుకున్న తరువాత వీరిద్దరూ తమకు వైరస్ సోకదన్న ధీమాతో మాస్క్ ధరించలేదని, భౌతిక దూరం పాటించడం, చేతులను శానిటైజ్ చేసుకోవడం వంటి నిబంధనలు పాటించలేదని, ఈ కారణంగానే వైరస్ సోకిందని ఉన్నతాధికారులు వెల్లడించారు. వారిద్దరి పేర్లను మాత్రం బహిర్గతం చేయలేదు.

అయితే  తొలి డోస్ తీసుకున్న 42 రోజుల తరువాతనే శరీరంలో కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీస్ వృద్ధి జరుగుతుందని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. టీకా తీసుకున్నా అన్ని జాగ్రత్తలతో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. చాలా మంది తొలి టీకా తీసుకోగానే నిబంధనలను పాటించడం లేదని, అందువల్లే ఇటువంటి కేసులు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.