కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి అజ్మీర్ వెళ్తున్న టెంపో వాహనాన్ని లారీ ఢికొట్టింది. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మాదార్పురం గ్రామ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొత్తం 14 మంది మరణించారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు టెంపోలో మొత్తం 18 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా మదనపల్లి మండలం అంబచెరువుమిట్టలోని ఎన్టీఆర్ నగర్ కాలనీకి చెందిన వారు. 14 మంది మృతుల్లో ఓ చిన్నారితో పాటు ఎనిమిది మంది మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. టెంపో డ్రైవర్ కూడా మరణించాడు.