ఎన్నికలు (Elections) రాజకీయం (Politics)

రెండో ద‌శ పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫైన‌ల్ ఫ‌లితాలు ఇవీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రుగుతున్న పంచాయ‌తీ ఎన్నిక‌ల రెండో విడ‌త‌లోనూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హ‌వా న‌డిచింది. మొత్తం 3,327 స‌ర్పంచ్ స్థానాల‌కు రెండో విడ‌త‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తుదారులు 2,635 స్థానాల‌ను గెలుచుకున్నారు. ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీ మ‌ద్ద‌తుదారుల‌కు 558 స్థానాలు ద‌క్కాయి. జ‌న‌సేన పార్టీ ‌మ‌ద్ద‌తుదారులు 37 చోట్ల‌, భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌ద్ద‌తుదారులు మూడు చోట్ల విజ‌యం సాధించ‌గా స్వ‌తంత్రులు 93 మంది గెలుపొందారు.

రెండో విడ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ప‌లువురు ముఖ్య‌నేత‌ల‌కు షాక్ త‌గిలింది. మంత్రి కొడాలి నాని స్వ‌గ్రామమైన కృష్ణా జిల్లా పెద‌పారుపూడి మండ‌లం య‌ల‌మ‌ర్రు గ్రామంలో టీడీపీ అభ్య‌ర్థి కొల్లూరి అనూష విజ‌యం సాధించింది. అయితే, ఈ గ్రామంలో కొడాలి నాని ప్రాతినిథ్యం వ‌హిస్తున్న గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో ఉండ‌దు. పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉంటుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.