వార్తలు (News)

విశాఖలో 5కె పాదయాత్ర

ఎన్నికల సందర్భంగా విరామం ఇచ్చిన ఉక్కు ఉద్యమాన్ని ఇప్పుడు తిరిగి పునఃప్రారంభించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా పరిరక్షణ పోరాట కమిటీ ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. ఆదివారం పోరాట కమిటీ ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం నుంచి పాత గాజువాక వరకు 5కె పాదయాత్ర చేపట్టారు.

ఈ కార్యక్రమంలో ఉక్కు పరిశ్రమ ఉద్యోగులే కాకుండా వారి కుటుంబ సభ్యులు, ప్రజలు కూడా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

కేంద్ర ప్రభుత్వం.. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకునే వరకూ పోరాడతామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఇప్పటికే ప్రకటించింది. ఈ ఉద్యమానికి పలువురు ప్రముఖులు సైతం మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.