స్పైస్‌జెట్ ఈ నెల 28 నుంచి కొత్తగా 66 కొత్త విమాన సేవలను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఉన్న మార్గాల్లో కొన్ని ఉండగా అదనంగా మరికొన్ని జోడించినట్లు పేర్కొంది. ఇందులో హైదరాబాద్-దర్భాంగా, హైదరాబాద్-ముంబయిల మధ్య కొత్త సర్వీసులను నడపనుంది. ఉడాన్ పథకంలో భాగంగా కొన్ని చిన్న పట్టణాలకు ఇప్పటికే విమానాలు నడుపుతుంది కానీ ఆయా ప్రాంతాలకు పెరిగిన ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కొత్తగా విమానాలను ప్రారంభిస్తోంది.