జాతీయం (National) వార్తలు (News)

ప్రైవేటీకరణకు సిద్ధంగా ఉన్న మరికొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు

ప్రభుత్వం యిర్ ఎండియా, బీఎస్ఎన్ఎల్, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌తోపాటు మరెన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే! ఇప్పుడు ఆ నిర్ణయంలో భాగంగా ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వాటాలు కలిగిన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాలను ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. అందులోని వాటాలను విక్రయించడం ద్వారా రూ. 2.5 లక్షల కోట్లను సమీకరించాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

తొలి దశ ప్రైవేటీకరణలో లక్నో, అహ్మదాబాద్, జైపూర్, మంగళూరు, తిరువనంతపురం, గౌహాటి విమానాశ్రయాల కాంట్రాక్ట్‌లను అదానీ గ్రూప్ ఇప్పటికే దక్కించుకుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 13 విమానాశ్రయాలను ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం గుర్తించగా అందులో పైన పేర్కొన్న నాలుగు విమానాశ్రయాల్లోని ఏఏఐ వాటాలను అమ్మేయాలని నిర్ణయించినట్టు ఈ విషయంతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తుల ద్వారా తెలిసింది. మరికొన్ని రోజుల్లో ఈ నిర్ణయం కేబినెట్ ఆమోదం కోసం వెళ్లనుంది.

కొనుగోలుదారులను ఆకర్షించాలని విమానాశ్రయాల అమ్మకం విషయంలో లాభాల్లో ఉన్న, అంతగా లాభాల్లో లేని విమానాశ్రయాలను కలిపి విక్రయించనున్నారు. పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఏఏఐ దేశవ్యాప్తంగా 100కుపైగా విమానాశ్రయాలను నిర్వహిస్తుంటే ముంబై విమానాశ్రయంలో అదానీ గ్రూప్‌నకు 74 శాతం వాటా ఉంది. మిగతా 26 శాతం వాటా ఏఏఐకే సొంత వాటా. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జీఎంఆర్ గ్రూపునకు 54 శాతం వాటా ఉండగా, ఏఏఐకి 26 శాతం, ఫ్రాపోర్ట్ ఏజీ అండ్ ఎరామన్ మలేసియాకు 10 శాతం వాటాలు ఉన్నాయి.

హైదరాబాద్, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏఏఐ, రాష్ట్ర ప్రభుత్వానికి 26 శాతం వాటా ఉంది. 2021-22 బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, కొత్తగా మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇప్పటికే మౌలిక సదుపాయాల రంగంలోని ప్రభుత్వ ఆస్తులను విక్రయించడమే ముఖ్యమైన దారిగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఏప్రిల్ 1తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆస్తుల విక్రయం ద్వారా మొత్తం 1.75 లక్షల కోట్ల సమీకరించాలని నిర్ణయించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.