కరోనా కేసులు అంతకంతకు పెరుగుతుండడంతో వైరస్‌ను కట్టడి చేసేందుకు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. ఇప్పటికే మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇవాళ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగి గత 24 గంటల వ్యవధిలోనే కొత్తగా 298 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,91,861కి చేరింది.

నిన్న కోవిడ్ వల్ల నెల్లూరు, విశాఖపట్నంలలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య 7,184కి చేరుకుంది.

ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,400 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 164 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 8,83,277కి చేరింది. నిన్న 45,664 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహిస్తే మొత్తం నిర్థారణా పరీక్షల సంఖ్య 1,45,34,762కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో చిత్తూరు 90, గుంటూరు 48, తూర్పుగోదావరి 32, కృష్ణా 32, విశాఖపట్నం 32, కర్నూలు 14, కడప 12, ప్రకాశం 11, అనంతపురం 9,శ్రీకాకుళం 7, పశ్చిమ గోదావరిలలో 5, విజయనగరం 3, నెల్లూరు 3 చొప్పున కేసులు నమోదయ్యాయి