తమిళనాడులో శనివారం ఉదయం సేలం- చెన్నై జాతీయ రహదారిలో సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.37.57 కోట్ల విలువైన 302 కిలోల బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారానికి తగిన ఆధారాలు చూపకపోవడంతో నగలన్నింటినీ స్వాధీనం చేసుకుని, గంగవల్లి ట్రెజరీకి అప్పగించారు. డ్రైవర్‌, మరో ఇద్దరిని విచారిస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇవి పట్టుబడటం పలు అనుమానాలకు తావిస్తుంది.