వార్తలు (News)

దేశవ్యాప్తంగా మహారాష్ట్రలోనే సగానికి పైగా కేసులు

భారత దేశంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్క మహారాష్ట్రలోనే సగానికిపైగా కరోనా కొత్త కేసులు ఉన్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. గత 24 గంటల్లో 8,64,368 కరోనా పరీక్షలను నిర్వహిస్తే 25,320 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే! దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,13,59,048కి చేరింది.

గత 24 గంటల్లో కరోనాతో 161 మంది ప్రాణాలు కోల్పోవడంతో, ఇప్పటి వరకు దేశంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 1,58,607కి చేరింది. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 16,637 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,09,89,897కి చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2,10,544కి పెరిగింది. కాగా, ఒక్క మహారాష్ట్రంలోనే ఒక్కరోజు వ్యవధిలో 15,602 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇక కరొనాతో 88 మంది కరోనాతో మరణించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.