దేశంలోనే తొలిసారిగా బెంగళూరు రైల్వే టెర్మినల్ ను సెంట్రలైజ్డ్ ఎయిర్ కండీషనింగ్ మరియు అధునాతన సదుపాయాలతో నిర్మించి దీనికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరును పెట్టారు. దీని నిర్మాణానికి రూ.314 కోట్ల ఖర్చు అయ్యింది. ఇది త్వరలోనే ప్రజలకు వినియోగంలోకి రానున్నదని” రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు.
మరిన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను బెంగళూరుతో అనుసంధానానికి ప్రవేశపెట్టాలని డిమాండ్లు
వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బయప్పనహళ్లి లో న్యూ కోచ్ టర్మినల్ నిర్మాణానికి 2015-16లో ప్రణాళిక సిద్ధం చేశామని సౌత్ వెస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ చెప్పారు.

భారతదేశంలో మొట్ట మొదటి ఈ సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్డ్ రైల్వే టెర్మినల్ ను బెంగళూరు విమానాశ్రయంకి సమానంగా నిర్మించినట్లు పేర్కొన్నారు. ఈ స్టేషన్ నుంచి ప్రతిరోజు 50 రైళ్లను నడపనున్నారు. 4,200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టర్మినల్ రోజు 50 వేల మంది వరకు స్టేషన్‌ను సందర్శించడానికి అనుకూలంగా ఉంటుంది. టెర్మినల్‌లోఏడు ప్లాట్‌ఫారమ్‌లు, 3 పిట్ లైన్లు ఉన్నాయి.ప్రయాణికుల సౌకర్యార్థం రెండు సబ్‌వేలు, ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఎస్కలేటర్లు, వీఐపీ లాంజ్, ఫుడ్ కోర్టు, అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాలు, రియల్ టైం ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టం తదితర వసతులు కల్పించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
