దక్షిణ మధ్య రైల్వే తాజాగా ఒక ప్రకటన చేసింది. దాని ప్రకారంగా ఈ నెల 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌, అజంతా ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌- ధ‌నపూర్‌ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్‌ నుంచి కాక కాచిగూడ నుంచి రాకపోకలు సాగిస్తాయని ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఆటోమేటిక్‌ కోచ్‌ వాష్‌ ప్లాంట్‌ (ఏసీడబ్ల్యూపీ) నిర్మాణం జ‌రుగుతున్నందున ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు ఫ‌ల‌క్‌నుమాతోపాటు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ నుంచి బ‌య‌లుదేరే మరొక మూడు ప్రత్యేక రైళ్ల రాక‌పోక‌ల‌పై ఈ నిర్ణయం తీసుకున్నట్టు శనివారం ప్రకటించారు. ఈ మూడు రైళ్ల రాక‌పోక‌ల విష‌య‌ంపై దక్షిణ మధ్య రైల్వే తాత్కాలిక మార్పులు చేసింది.

ఈ నెల 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌, అజంతా ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌- ధ‌నపూర్‌ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్‌ నుంచి కాక‌ుండా కాచిగూడ నుంచి రాకపోకలు సాగిస్తాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో వెల్లడించింది. దీని ప్రకారం సికింద్రాబాద్‌ నుంచి హౌరా వెళ్లే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ రైలు (02704) ఈ నెల 15 నుంచి కాచిగూడ నుంచి బయల్దేరనుంది.

సికింద్రాబాద్ – ధ‌నపూర్‌ (02787), సికింద్రాబాద్‌ -మన్మాడ్‌ ప్రత్యేక రైళ్లు (అజంతా ఎక్స్‌ప్రెస్ – 07064) రైలు కూడా అది బయలుదేరే సమయంలో సికింద్రాబాద్‌ నుంచి కాకుండా కాచిగూడ నుంచి బయలుదేరనుంది. ఈ మూడు రైళ్లు తిరుగు వచ్చేటప్పుడు కూడా కాచిగూడకే చేరుకుంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వివరించారు.