ఈజిప్టు దక్షిణ ప్రావిన్స్‌లో కైరో నగరానికి 320 కిలోమీటర్ల దూరంలో ఓ బస్సు ట్రక్కును ఓవర్‌టేక్‌ చేయబోయి అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. బోల్తాపడిన బస్సు, ట్రక్కు ఒకదానికొకటి ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 20 మంది అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఇప్పటికే ప్రమాద స్థలంలో రెస్క్యూటీమ్స్‌ రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు గవర్నర్‌ వెల్లడించారు.