కరోనా ఒకసారి సోకిన వారికి మళ్ళీ వైరస్ సోకె అవకాశం ఉందా అంటే ఉంది అనే అంటున్నారు నిపుణులు. 102 రోజుల వ్యవధి తర్వాత మళ్లీ వైరస్ సోకితే, దీన్ని రీ-ఇన్ఫెక్షన్‌గా డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. ఇలాంటి రోగుల్లో ఏ రకం వైరస్‌ వల్ల కొత్త ఇన్ఫెక్షన్ సోకిందో మొదట తెలుసుకోవడం జరుగుతుంది. బ్రిటన్ నుంచి వచ్చిన వైరస్ ఎక్కువగా పిల్లలు, యువతలో వ్యాపిస్తోంది. బ్రిజిల్ వైరస్ అయితే, మరణించే ముప్పు ఎక్కువగా ఉంటోంది. అదే దక్షిణాఫ్రికా వైరస్ అయితే, లక్షణాలు కాస్త ఆలస్యంగా బయటపడతాయి. ఏ రకం వైరస్ సోకింది తెలుసుకుని తర్వాత ట్రీట్ మెంట్ మొదలు పెట్టాలి. సాధారణంగా వైరస్ మ్యుటేట్ అయ్యేటప్పుడు దీనికి వ్యాక్సీన్లను తట్టుకుని నిలబడగలిగే, పరీక్షల్లో బయటపడని, ఔషధాలకు లొంగని శక్తి సంతరించుకుంటుంది.