కరోనా రెండో వేవ్ భారత దేశం లో విధ్వంసమే సృష్టిస్తుంది. రోజు వారి కేసులు లక్ష దాటేసినా, రోజు రోజుకు పెరిగిపోతూ నిన్నటికి లక్ష ఎనభై వేలు కరోనా కేసులు నమోదైనా, మరణాలు రేటు తక్కువ గా ఉండడం కొంచం పర్వాలేదు అనే ధైర్యం నిన్నటితో పూర్తిగా సన్నగిల్లింది. నిన్న ఒక్క రోజే 1,026 మంది మృతి చెందారు. ఇక ప్రపంచ వ్యాప్త రోజు వారి కేసుల్లో భారత్ ది మొదటి స్థానం. గత కొద్దీ రోజులుగా రోజూ లక్ష కేసులు మన దేశంలో మాత్రమే నమోదు అవుతున్నాయి. ఒక పక్క వాక్సినేషన్ జోరుగా సాగుతున్నా, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా, ప్రజల్లో మాత్రం అదే నిర్లక్ష్య ధోరణి. అందరూ మాస్క్లు ధరించాలి, శానిటైజెర్ల తో శుభ్రం చేసుకోవాలి, వీలైనంత వరకు ఇంటి అవసరాలకు ఒక్కరు మాత్రమే బైటకు రావాలి. కరోనా కట్టడి కి ప్రభుత్వం కంటే ప్రజలే బాధ్యత ఎరిగి నడుచుకోవాలి. లేదంటే మనం కోల్పోయేది మన సొంతవారినే కావచ్చు!