పేలవ ప్రదర్శన తో గెలవాల్సిన మ్యాచ్ ను చేతులారా కోల్పోయిన కోల్కత్తా. ఓడిపోయే స్థితి నుంచి గొప్పగా పుంజుకున్నామని, పోరాట పటిమ ప్రదర్శించిన ముంబై. 17 బంతుల్లో 21 పరుగులు చెయ్యాల్సిన స్థితి నుండి 10 పరుగులు తేడా తో ఓడిపోయే వరకు అంతా స్వయం కృతం. 180 పరుగులు విజయ లక్ష్యం ఉంటుందేమో అనుకున్నారు అంతా, అయితే చివరి ఓవర్ల లో ముంబై ని కట్టడి చెయ్యగలిగిన కోల్కత్తా 152 విజయ లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకునేలా చేసింది. అయితే ముంబై ని ఒంటి చేత్తో గెలిపించే సత్తా ఉన్న బుమ్రా, బౌల్ట్, చాహర్ వంటి బౌలర్ల ముందు కోల్కత్తా ఓటమి తప్పలేదు. ముంబై బౌలర్లు ప్రతిభ కంటే కోల్కత్తా బ్యాట్సమెన్ మితిమీరిన ఆత్మవిశ్వాసం ఈ ఓటమి కి కారణం గా చెప్పుకోవాలి. చెత్త షాట్స్ వాళ్ళ చేతులారా వికెట్లు సమర్పించుకుని 10 పరుగుల తో ఓడిపోయారు. మిగిలిన టీమ్స్ కి ఇది ఒక గుణపాఠం కావాలి, చివరి బంతి వరకు పోరాడిన ముంబై శబాష్ అనిపించుకుంది. పాయింట్ల పట్టిక లో ఖాతా తెరిచింది.