కరోనా కేసులు తీవ్రతరం అవుతుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 15 రోజుల పాటు జనతా కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. అత్యవసరం కాని షాపులు, పరిశ్రమలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

దేశానికి ఆర్థిక రాజధాని అయిన ముంబైతో సహా మహారాష్ట్ట్ర వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విధించడంతో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఏకంగా 15 రోజుల పాటు జనతా కర్ఫ్యూ అంటే తమ పరిస్థితి ఏంటని వ్యాపారులు, కార్మికులు, కూలీలు వాపోతున్నారు. ప్రభుత్వ నిర్ణయం వెలువడిన వెంటనే వలస కూలీలంతా మళ్లీ సొంతూళ్ల బాట పట్టడంతో ముంబై లోక్‌మాన్య తిలక్ టెర్మినల్‌లో రద్దీ విపరీతంగా పెరిగింది.