అంతర్జాతీయం (International) వార్తలు (News)

పాకిస్థాన్‌లో రెండు కుక్కలకు మరణశిక్ష.. కారణం??

పాకిస్థాన్‌లో కరాచీలోని ఓ లాయర్‌పై దాడి చేశాయన్న కారణంగా రెండు పెంపుడు కుక్కలకు మరణశిక్ష విధించారు. మీర్జా అక్తర్ అనే సీనియర్ లాయర్ ఈ కుక్కలు, వాటి యజమానిపై కోర్టుకు వెళ్లారు. అయితే కోర్టు బయట సెటిల్మెంట్‌లో భాగంగా ఆ కుక్కలకు మరణశిక్ష విధించడానికి అంగీకరించి వాటి యజమాని లాయర్‌తో రాజీకొచ్చారు.

గత నెలలో మార్నింగ్ వాక్ కోసం వెళ్లిన లాయర్ మీర్జా అక్తర్‌పై ఈ రెండు కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. వాటిని ఇళ్ల మధ్య ఉంచినందుకు యజమానిని విమర్శిస్తూ చాలా మంది కామెంట్స్ చేయగా దీనిపై లాయర్ అక్తర్ కోర్టుకెళ్లడంతో కుక్కల యజమాని రాజీకొచ్చాడు.

ఆ లాయర్ రాజీకి అంగీకరిస్తూనే పలు షరతులు విధించారు. ఆ కుక్కలను వెంటనే ఓ వెటర్నరీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి విషపూరిత ఇంజెక్షన్లతో చంపేయాలని, ఈ ఘటనపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదకర కుక్కలను ఇంట్లో పెంచుకోవద్దని సదరు యజమానికి లాయర్ అక్తర్ షరతులు విధించారు. ఈ ఒప్పందంపై ఇద్దరూ సంతకాలు చేసి కోర్టులో సమర్పించారు. దీనిపై జంతు ప్రేమికులు తీవ్రంగా మండిపడుతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    103
    Shares
  • 103
  •  
  •  
  •  
  •