క్రైమ్ (Crime) జాతీయం (National) వార్తలు (News)

జమ్ముకశ్మీర్‌లోని అర్నియా సెక్టార్ వద్ద మరోసారి డ్రోన్ కలకలం!!

భారత్‌-పాక్‌ అంతర్జాతీయ సరిహద్దు జమ్ముకశ్మీర్‌లోని అర్నియా సెక్టార్ వద్ద మంగళవారం రాత్రి సరిహద్దు భద్రతా బలగాలు డ్రోన్‌ సంచారం గుర్తించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కాల్పులు జరపడంతో డ్రోన్ వెనక్కి జారుకుంది. ఈ మేరకు బీఎస్‌ఎఫ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

‘జులై 13 రాత్రి 10 గంటల సమయంలో మా బలగాలు అర్నియా సెక్టార్‌ వద్ద ఆకాశంలో ఎర్రటి కాంతి గుర్తించి వెంటనే ఆ దిశగా కాల్పులు జరపడంతో ఆ డ్రోన్ వెనక్కి వెళ్లిపోయింది. ఘటనా స్థలాన్ని పరిశీలించినప్పటికీ అనుమానాస్పదంగా ఏమీ బయటపడలేదు’ అని బీఎస్‌ఎఫ్ వర్గాలు వెల్లడించాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •