వార్తలు (News)

ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి.. దేవీపట్నం వద్ద నిలిచిన రాకపోకలు!!

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహించి వరద అంతకంతకూ పెరగడంతో పోచమ్మగండి వద్ద ఉన్న గండి పోచమ్మ ఆలయం పూర్తిగా నీట మునిగింది. దీంతో దర్శనాలను తాత్కాలికంగా నిలిపేశారు. ఆలయాన్ని ఆనుకొని ఉన్న ఇళ్లన్నీ నీట మునగడంతో బాధిత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. దేవీపట్నం, తొయ్యేరు మధ్య ఆర్అండ్‌బీ రహదారిపైకి భారీగా వరద నీరు చేరడంతో 36 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

పూడిపల్లి, తొయ్యేరు, ఏవేరవరం, కేవేరవరం, దండంగి గ్రామాల్లో వరద నీరు చుట్టుముట్టింది. పోలవరం ఎగువ కాపర్ డ్యాం వద్ద వరద నీరు పెరగటంతో పాటు రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పోచమ్మ గండి నుంచి పాపికొండలు వెళ్లే విహారయాత్రను కూడా అధికారులు నిలిపివేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    48
    Shares
  • 48
  •  
  •  
  •  
  •