వార్తలు (News)

గద్వాల జిల్లాలో వందేళ్ల నాటి లాకర్..??

జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం భీంపురంలో పాత ఇల్లును కూలుస్తున్న సమయంలో వందేళ్ల నాటి లాకర్ బయటపడింది. ఈ లాకర్ ను ఓపెన్ చేస్తే దస్తావేజులు లభ్యమయ్యాయి. ఈ లాకర్ లో బంగారం, వెండి ఆభరణాలు ఉంటాయని భావించినప్పటికీ దస్తావేజులు మాత్రమే దొరికాయి. ఈ లాకర్ ను స్వాధీనం చేసుకొన్న రెవిన్యూ, పోలీసు అధికారులు గ్రామంలోని బీసీ కమ్యూనిటీ హాల్ లో భద్రపర్చారు. ఈ లాకర్ ను నాలుగు గంటలు కష్టపడి ఓపెన్ చేశారు.

అయితే ఈ లాకర్ లో ఓ గుడ్డలో కట్టిన దస్తావేజులు లభ్యమయ్యాయి. ఈ లాకర్ లో తమ కుటుంబానికి చెందిన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన పత్రాలను భద్రపర్చేవారని తమ తల్లిదండ్రులు చెప్పారని ఇంటి యజమానులు తెలిపారు.ఈ లాకర్ లో బంగారం, వెండి ఆభరణాలు ఉంటాయని ఊహించినప్పటికీ కేవలం దస్తావేజులు మాత్రమే లభ్యం కావడంతో స్థానికులు నిరాశతో వెనుదిరిగారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •