రివ్యూ రాజా (Review Raja) వార్తలు (News)

ఈ వారం ఓటీటీ లో విడుదల అవుతున్న చిత్రాలు??

కరోనా కారణంగా సినిమా థియేటర్లు అన్ని మూతబడిన సంగతి తెలిసిందే! అయితే థియేటర్లు తెరచుకోవడానికి ప్రభుత్వాలు అనుమతిచ్చినప్పటికీ నష్టాల భయంతో అవి తెరుచుకోలేదు. ఈ తరుణంలో కాపీ పూర్తయిన చిత్రాలను ల్యాబ్‌లో పెట్టుకుని నష్టపోవడం ఇష్టం లేని నిర్మాతలు ఓటీటీ బాట పడుతున్నారు. అయితే కొద్ది రోజులుగా ఓటీటీ వేదిక వివిధ భాషల చిత్రాలతో కళకళలాడుతోంది. ఈ వారం విడుదలయ్యే చిత్రాల వివరాలు ఒకసారి చూడండి!

30 కోట్ల బడ్జెట్‌తో మహేశ్‌ నారాయణన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘మాలిక్‌’ చిత్రాన్ని మొదట థియేటర్‌లో విడుదల చేయాలనుకున్నారు. పరిస్థితులు సహకరించకపోవడంతో ఈ నెల 15న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. పలు వివాదాలకు గురైన ‘తుఫాన్‌’ చిత్రం కూడా ఓటీటీ బాట పట్టింది. ఇది ఫరాన్‌ అక్తర్‌ కథానాయకుడిగా రాకేశ్‌ ఓం ప్రకాశ్‌ దర్శకత్వం వహించిన స్పోర్ట్స్‌ డ్రామా. ఈ నెల 16న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల అవుతోంది. వీటితోపాటు మరికొన్ని చిత్రాలు ఓటీటీలో రానున్నాయి.

అమలాపాల్‌ కీలక పాత్ర పోషించిన ‘కుడి ఎడమైతే’ చిత్రం ఈ నెల 16న ఆహా ఓటీటీ ద్వారా విడుదల కానుంది. క్రైమ్‌, సస్పెన్స్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు పవన్‌కుమార్‌ దర్శకత్వం వహించారు. మలయాళ నటుడు పహాద్‌ ఫాజిల్‌ తాను నటించిన చిత్రాలను వరుసగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు.

సోనీ లైవ్‌
వాజా (జులై 16)
హెచ్‌బీవో మ్యాక్స్‌
స్పేస్‌ జామ్‌-ఏ న్యూ లెగసీ (జులై 16)

ఆహా
కుడి ఎడమైతే (జులై 16)

నెట్‌ఫ్లిక్స్‌
గన్‌పౌడర్‌ మిల్క్‌షేక్‌ (జులై 14)
నెవర్‌ హ్యావ్‌ ఐ ఎవర్‌ ఎస్‌2 (జులై 15)
ఫియర్‌ స్ర్టీట్‌ 3(జులై 16)
డీప్‌ (జులై 16)
ఎ పర్ఫెక్ట్‌ ఫిట్‌(జులై 16)
జానీ టెస్ట్‌ (జులై 16)
కాస్మిక్‌ సిన్‌ (జులై 17)
మిల్క్‌ వాటర్‌ (జులై 20)

డిస్నీ+ హాట్‌స్టార్‌
ది వైట్‌ లోటస్‌ (జులై 13)
క్యాచ్‌ అండ్‌ కిల్‌-ది పాడ్‌ క్యాస్ట్‌ టేప్స్‌ (జులై 13)

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •