అంతర్జాతీయం (International) వార్తలు (News)

కరోనాను భారత్ కు తీసుకువచ్చిన వ్యక్తికి రీ-ఇన్‌ఫెక్షన్‌!!

దేశంలో కరోనా వైరస్‌ బయటపడి ఇప్పటికి ఏడాదిన్నర దాటినప్పటికీ దాని ఉదృతి ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి. ఇప్పటికే వైరస్ సోకిన కొంతమందికి మళ్ళీ తిరిగి సోకుతున్న దాఖలాలు కనిపించాయి. భారత్‌లో కొవిడ్‌-19 సోకిన తొలి వ్యక్తిగా రికార్డుకెక్కిన కేరళ మహిళ మరలా వైరస్ బారిన పడ్డట్టుగా అధికారులు వెల్లడించారు.

యాంటీజెన్‌ పరీక్షల్లో నెగటివ్‌ వచ్చినప్పటికీ ఆర్‌టీ-పీసీఆర్‌లో మాత్రం పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి లక్షణాలు లేవు’ అని కేరళలోని త్రిస్సూర్‌ జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కేజే రీనా వెల్లడించారు. ఉన్నత చదువుల కోసం దిల్లీ వెళ్లేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఆమె నమూనాలను పరీక్షించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ప్రస్తుతం వారి ఇంటిలోనే ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.

కరోనా రీ-ఇన్‌ఫెక్షన్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఏకాభిప్రాయం లేదనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి కనీసం 102 రోజుల వ్యవధిలో రెండోసారి పాజిటివ్‌ వస్తే దాన్ని రీ-ఇన్‌ఫెక్షన్‌గా పరిగణించాలని భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) ఇదివరకే నిర్ణయించింది. అయితే ఈ మధ్యకాలంలో ఒకసారి నెగటివ్‌ వచ్చి మళ్లీ పాజిటివ్‌ వస్తేనే దాన్ని రీ-ఇన్‌ఫెక్షన్‌గా గుర్తిస్తారు. అమెరికాలో వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) ప్రకారం, ఓ వ్యక్తికి 90 రోజుల అనంతరం మళ్లీ పాజిటివ్‌ వస్తే, జీనోమ్‌ సీక్వెన్స్‌ ద్వారా రీ-ఇన్‌ఫెక్షన్‌ను నిర్ధారించాలని సూచనలు చేస్తుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •