వార్తలు (News)

పెళ్లి ఇంట్లో జనరేటర్ పేలి వధూవరులు సహా ఆరుగురు మృతి!!

మహారాష్ట్ర చంద్రాపూర్‌ పట్టణ సమీపంలోని దుర్గాపూర్‌ గ్రామ నివాసి రమేష్‌ లష్కరే గుత్తేదారుగా పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు అజయ్‌ వివాహం పది రోజుల కిందట అదే గ్రామానికి చెందిన మాధురితో జరుగగా రెండు రోజుల కిందట కోడలిని ఇంటికి తీసుకొచ్చారు.

ఇంట్లో పండుగ వాతావరణం ఉంది. సోమవారం రాత్రి భారీ వర్షం పడటంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోగా పెళ్లి కోసమని గతంలో అద్దెకు తెచ్చుకున్న జనరేటర్‌ ఇంట్లో ఉండడంతో దానిని ఆన్‌ చేశారు. భోజనాలు చేశాక అంతా నిద్రపోయాక అర్ధరాత్రి సమయంలో అది పేలిపోగా ఆ పేలుడుకు వెలువడిన పొగతో ఊపిరి ఆడక అసువులు బాశారు. దీంతో వధూవరులు సహా వరుడి తోబుట్టువులు ముగ్గురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరొకరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •