జాతీయం (National) వార్తలు (News)

స్వల్పంగా తగ్గిన ద్రవ్యోల్బణం !!

దేశవ్యాప్తంగా ఆహార పదార్థాలపై పెరుగుతున్న ధరలతో సామాన‍్య జనాలు ఇబ్బందిపడుతున్న వేళ సామాన్యుడికి కాస్త ఊరట లభించే అవకాశాలు ఉన్నాయి. భారత్‌లో జూన్‌ నెలకుగాను రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా 6.26 శాతానికి తగ్గింది. సోమవారం రోజున షనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) రిటైల్‌ ద్రవ్యోల్భణ గణాంకాలను విడుదల చేసింది. ద్రవ్యోల్బణం కాస్త తగ్గినా, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అంచనాలకు మించి రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇది రెండోసారి.

జూన్‌ నెలలో ప్రధానంగా ఆహారోత్పత్తుల ధరలు, ఇంధన ధరల కారణంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం కాస్త పెరిగింది. ‘ఇంధన, లైట్‌’ విభాగంలో ద్రవ్యోల్బణం మే నెలతో పోల్చుకుంటే జూన్‌ నెలలో 12.68 శాతం గణనీయంగా పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం జూన్‌లో 5.15 శాతానికి పెరిగిందని, మేలో ఇది 5.01 శాతంగా ఉందని ఎన్‌ఎస్‌ఓ పేర్కొంది. ఆహార ఉత్పత్తుల్లో ఆహార, పానీయాల విభాగంలో ద్రవ్యోల్బణం 5.58 శాతంగా ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •