ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) జాతీయం (National) వార్తలు (News)

భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కి దక్కిన సుత్నిక్‌-వి తయారీ అవకాశం!!

రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి టీకాను ప్రముఖ టీకా తయారీ సంస్థ ‘సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ)’ భారత్ లో ఉత్పత్తి చేయడానికి అనుమతి సంపాదించుకుంది. సెప్టెంబరు నుంచి పుణెలోని సంస్థ తయారీ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు, స్పుత్నిక్‌ టీకాను రూపొందించిన రష్యన్‌ ‘డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌)’ మంగళవారం ప్రకటించింది. ఏటా 300 మిలియన్ల డోసులు ఉత్పత్తి చేసేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తుంది.

కరోనా వైరస్‌పై పోరాడటంలో మెరుగైన సామర్థ్యం, భద్రత కనబరిచిన స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ను భారీ స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వాలు, సంస్థలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని, ఇప్పటికే రష్యాలోని గమలేయా సంస్థ.. సీరం ఇన్‌స్టిట్యూట్‌కు కావాల్సిన సాంకేతికతను బదిలీ చేయడం ప్రారంభించిందని ఆర్‌డీఐఎఫ్‌ సీఈఓ కిరిల్‌ దిమిత్రివ్‌ తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •