జాతీయం (National) వార్తలు (News)

ఆంధ్రప్రదేశ్‌కు 11, తెలంగాణకు 14 పతకాలు!!

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం శాఖ సైనిక, పోలీసు అధికారులకు వివిధ పతకాలను వివిధ రాష్ట్రాలకు చెందిన 1,380 మంది పోలీసులకు ప్రకటించింది. ఇద్దరికి అత్యున్నతమైన రాష్ట్రపతి పోలీసు పతకాలు(పీపీఎంబీ).. 628 మందికి గ్యాలంటరీ పతకాలు(పీఎంబీ) అందించనున్నారు. 88 మందికి రాష్ట్రపతి పోలీసు పతకాలు(పీపీఎం).. 662 మందికి విశిష్ట సేవా పతకాలు ఇవ్వనున్నారు. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 11 మందికి, తెలంగాణకు చెందిన 14 మందికి గ్యాలంటరీ పోలీసు పతకాలు లభించనున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    13
    Shares
  • 13
  •  
  •  
  •  
  •