టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

ప్రూట్‌ బౌల్‌ ఆఫ్‌ స్టేట్‌గా పేరొందిన ఏపీ!!

ఉద్యానపంటలు సాగు చేసే రైతులు, పట్టు పరిశ్రమ, వ్యవసాయ అనుబంధ రంగాలవారు నష్టపోకుండా చూడాలని ముఖ్యమంత్రి జగన్‌ వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులతో జరిపిన మీటింగులో ఆదేశించారు. ఉద్యాన రంగంలో రైతుల ఆదాయాన్ని పెంచే వ్యూహాలను అమలు చేయాలని, అధిక ఆదాయాన్నిచ్చే పంటల సాగువైపు రైతులను ప్రోత్సహించాలని, పండించిన పంటలకు తప్పనిసరిగా గిట్టుబాటు ధర కల్పించాలని, పంటను పారబోసే పరిస్థితి ఎక్కడా కనిపించకూడదని, మెరుగైన సాగు విధానాలు, నాణ్యమైన ఉత్పత్తులు వచ్చేందుకు అవసరమైన పరిశోధనలన్నింటినీ చేయాలని, దీనికోసం జాతీయ, అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు.

అగ్రికల్చర్‌ విద్యార్థులు ఇకపై తప్పనిసరిగా రైతు భరోసా కేంద్రాల్లో కనీసం నెలరోజులపాటు పనిచేసేలా నిబంధన పెట్టాలని, రైతులకు బిందు, తుంపర్ల సేద్యం పరికరాలు మరింత తక్కువ ధరకు అందించేందుకు రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలని, కొబ్బరి, అరటి, బొప్పాయి, మిరప, టమోట, ఉల్లి, బత్తాయి పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా కొబ్బరి, బొప్పాయి, టమోట సాగులోనూ, ఉత్పాదకతలోనూ దేశంలోనే ఏపీ ప్రథమ స్ధానంలోనే నిల్చిందని, టిష్యూ కల్చర్‌ విధానంలో అరటిసాగు చేపడుతున్నామని, ఉద్యానపంటల్లో గరిష్ట సాగుతో ప్రూట్‌ బౌల్‌ ఆఫ్‌ స్టేట్‌గా ఏపీ పేరుపొందిందని సీఎంకు అధికారులు తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •