అంతర్జాతీయం (International) వార్తలు (News)

ఇండోనేషియా లో వర్జినిటీ టెస్టును రద్దు చేసిన సైన్యం??

ఇండోనేషియా సైన్యం మహిళల ప్రవేశం కోసం నిర్వహించే అమానవీయ, వివాదాస్పద టెస్టుకు స్వస్తి పలకడానికి నిర్ణయించుకుంది. చేతులతో తడిమి చేసే వర్జినిటీ(కన్యత్వం) పరీక్షలు తప్పనిసరి అన్న విధానాన్ని రద్దు చేస్తూ, ఇకపై సాధారణ శారీరక, వైద్యపరమైన పరీక్షలనే ప్రామాణికంగా తీసుకుంటామని అక్కడి మహిళలకు శుబ్గావార్త చెప్పింది.

సైన్యం నిర్ణయంపై అక్కడి మానవ హక్కుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. అలాంటి టెస్టులు చేయాల్సిన అవసరమే ఎన్నడూ లేదని కొందరు అభిప్రాయపడ్డారు. టూ ఫింగర్ టెస్ట్.. మహిళల హైమన్ ను(యోని మీద సన్నని పొర) డాక్టర్లు చెక్ చేస్తారు. వారి వర్జినిటీని నిర్ధారిస్తారు. అయితే ఇలాంటి చర్యలు అమానవీయం అని, క్రూరమైనవని, ఆ విధానానికి స్వస్తి చెప్పాలని న్యూయార్క్ బేస్డ్ హుమన్ రైట్స్ వాచ్ చెప్పింది.

ఆర్మీలో చేరాలనుకునే మహిళల నైతికత నిర్ధారించేందుకు వర్జినిటీ టెస్ట్ చేస్తున్నామని గతంలో ఇండోనేషియా సైన్యం చెప్పగా వర్జినిటీ టెస్టుకు ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవని డబ్ల్యూహెచ్ వో ప్రకటించింది. ఆలా ప్రకటించి కూడా ఇప్పటికి ఏడేళ్లు గడిచింది. హైమెన్ చీలిందా లేదా పాక్షికంగా చీలిందా అనేది పరీక్షలో భాగం అని, ఇప్పుడు అంతకుమించి ఏమీ లేదు” అని సైనిక ప్రతినిధి చెప్పారు. అంతేకాదు సైన్యం ఎంపిక ప్రక్రియ పురుషులు, మహిళలకు సమానంగా ఉండాలన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •